TS TRT(టీఎస్ టీఆర్టీ) పోస్టుల అర్హతల వివరాలు…
B.Ed., D.Ed (బీఈడీ, డీఈడీ) కోర్సులు పూర్తిచేసి, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే ఔత్సాహికుల కల సాకారం కానుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ.. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా teacher పోస్టులు త్వరలో భర్తీకి నోచుకోనున్నాయి. TELANGA PUBLIC SERVICE COMMISSION (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుంచి notification/నోటిఫికేషన్ రావడమే తరువాయి! ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల మేరకు method/భర్తీ విధానం, వివిధ posts ల qualification/అర్హతల వివరాలు..
ఇన్నాళ్లూ DSC గా భావిస్తూ వచ్చిన Teacher Recruitment/టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పు చేసి… TRT/టీఆర్టీ (TEACHER RECRUITMENT TEST/టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా) పేర్కొనడం ఉత్తర్వుల్లో ప్రధాన అంశంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో సీటెట్(CTET)/ఏపీ టెట్(AP TET)/ టీఎస్ టెట్(TS TET) ఉత్తీర్ణత మార్కులకు వెయిటేజీ కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. TRT/టీఆర్టీ పేరుతో నిర్వహించే రాత పరీక్షకు 80%; TET/టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ ఇచ్చి తుది జాబితా (FINAL LIST) రూపొందిస్తారు. ఈ రాత పరీక్ష( WRITTEN EXAMINATION) విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిలబస్‌ను ఎన్సీటీఈ(NCTE) మార్గదర్శకాల ప్రకారం రూపొందించనున్నట్లు సమాచారం.
TS TRT QUALIFICATIONS/టీఎస్ టీఆర్టీ అర్హతలు…
స్కూల్ అసిస్టెంట్ – మ్యాథమెటిక్స్ ( SCHOOL ASSISTANT—MATHS):
MATHS/మ్యాథమెటిక్స్ లేదా సంబంధిత సబ్జెక్టుతో కనీసం 50% మార్కులతో DEGREE/PG–డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. దీంతోపాటు మ్యాథమెటిక్స్ మెథడాలజీగా B.Ed/బీఈడీ ఉత్తీర్ణత. (లేదా) మ్యాథమెటిక్స్ మెథడాలజీగా కనీసం 50 % మార్కులతో నాలుగేళ్ల B.A., B.Ed/బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. మ్యాథమెటిక్స్, సైన్స్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
SCHOOL ASSISTANT PHYSICAL SCIENCE/స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సెన్సైస్):
Physics/ఫిజిక్స్, Chemistry(కెమిస్ట్రీ) లేదా తత్సబంధ సబ్జెక్టుల్లో ఏవైనా రెండు ఆప్షనల్స్‌గా (two options) కనీసం 50% మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. దీంతోపాటు ఫిజికల్ సైన్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/సైన్స్ మెథడాలజీలతో బీఈడీ ఉత్తీర్ణత. (లేదా) ఫిజికల్ సైన్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/సైన్స్ సబ్జెక్టుల్లో ఏదో ఒకటి మెథడాలజీగా కనీసం 50 % మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
SCHOOL ASSISTANT BIOLOGICAL SCIENCE/స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్) :
Botany(బోటనీ), జువాలజీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఏవైనా రెండు ఆప్షనల్‌గా ( two options) కనీసం 50% మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. దీంతోపాటు బయలాజికల్ సైన్స్/నేచురల్ సెన్సైస్/సైన్స్/బోటనీ/ జువాలజీ సబ్జెక్టుల్లో ఏదో ఒకటి మెథడాలజీగా B.Ed(బీఈడీ) ఉత్తీర్ణత. (లేదా) బయలాజికల్ సైన్స్/నేచురల్ సెన్సైస్/ సైన్స్/బోటనీ/జువాలజీ సబ్జెక్టుల్లో ఏదో ఒకటి మెథడాలజీగా కనీసం 50% మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
School Assistant Social Studies/స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) :
హిస్టరీ/ఎకనామిక్స్/జాగ్రఫీ/పొలిటికల్ సైన్స్ లేదా పలిటిక్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సోషియాలజీ/ సైకాలజీ/ ఫిలాసఫీ/కామర్స్/తత్సబంధ సబ్జెక్టుల్లో ఏవైనా రెండు ఆప్షనల్‌గా కనీసం 50% మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. దీంతోపాటు సోషల్ స్టడీస్/సోషల్ సెన్సైస్/జాగ్రఫీ/ హిస్టరీ/పాలిటిక్స్/పొలిటికల్ సైన్స్/ఎకనామిక్స్‌ల్లో ఏదో ఒకటి మెథడాలజీగా బీఈడీ ఉత్తీర్ణత. (లేదా) సోషల్ స్టడీస్/సోషల్ సెన్సైస్/ జాగ్రఫీ/హిస్టరీ/పాలిటిక్స్/పొలిటికల్ సైన్స్/ఎకనామిక్స్‌ల్లో ఏదో ఒకటి మెథడాలజీగా కనీసం 50 % మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ / బీఎస్సీ బీఈడీ ఇంటెగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
School Assistant English/స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) :
కనీసం 50% మార్కులతో.. English (ఇంగ్లిష్) ఒక Option Subjects/ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ/ఇంగ్లిష్ లిటరేచర్ ( English Literature)లో బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ ఇన్ ఇంగ్లిష్ ఉత్తీర్ణత. దీంతోపాటు ఇంగ్లిష్ మెథడాలజీలో బీఈడీ ఉత్తీర్ణత. (లేదా) ఇంగ్లిష్ సబ్జెక్ట్ మెథడాలజీగా కనీసం 50% మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్; లేదా సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2 ఉత్తీర్ణత.
SCHOOL ASSISTANT TELUGU/స్కూల్ అసిస్టెంట్ – తెలుగు :
కనీసం 50 % మార్కులతో.. తెలుగు ఒక ఆప్షనల్‌గా బ్యాచిలర్ డిగ్రీ (Bachelor Degree)/తెలుగు లిటరేచర్‌లో (Telugu Literature) బ్యాచిలర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజ్ (తెలుగు)/పీజీ ఇన్ తెలుగు ఉత్తీర్ణత. దీంతోపాటు Telugu Methodology/తెలుగు మెథడాలజీగా బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఉత్తీర్ణత. (లేదా) తెలుగు మెథడాలజీగా కనీసం 50 % మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్; లేదా సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2 ఉత్తీర్ణత.
SCHOOL ASSISTANT HINDI/స్కూల్ అసిస్టెంట్ – హిందీ :
కనీసం 50% మార్కులతో… Hindi(హిందీ) ఒక ఆప్షనల్‌గా బ్యాచిలర్ డిగ్రీ/హిందీ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజ్ (హిందీ)/పీజీ ఇన్ హిందీ ఉత్తీర్ణత. దీంతోపాటు హిందీ మెథడాలజీగా బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ హిందీ/ హిందీ శిక్షణ్ పరంగత్ ఉత్తీర్ణత. (లేదా) హిందీ మెథడాలజీగా కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్; లేదా సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2 ఉత్తీర్ణత.
School Assistant Urdu/స్కూల్ అసిస్టెంట్ – ఉర్దూ :
కనీసం 50 % మార్కులతో… ఉర్దూ ఒక ఆప్షనల్‌గా బ్యాచిలర్ డిగ్రీ/ఉర్దూ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజ్ (ఉర్దూ)/పీజీ ఇన్ ఉర్దూ ఉత్తీర్ణత. దీంతోపాటు ఉర్దూ మెథడాలజీగా బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ ఉర్దూ ఉత్తీర్ణత. (లేదా) ఉర్దూ మెథడాలజీగా కనీసం 50 % marksతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత. మ్యాథమెటిక్స్, సైన్స్; లేదా సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-2 ఉత్తీర్ణత.
స్కూల్ అసిస్టెంట్ – సంస్కృతం :
కనీసం 50 % మార్కులతో… సంస్కృతం సబ్జెక్ట్ ఆప్షనల్‌గా బ్యాచిలర్ డిగ్రీ/సంస్కృత సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజ్ (సంస్కృతం)/ పీజీ ఇన్ సంస్కృతం ఉత్తీర్ణత. దీంతోపాటు సంస్కృతం మెథడాలజీగా బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ సంస్కృతం ఉత్తీర్ణత. (లేదా) సంస్కృతం మెథడాలజీగా కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్, సైన్స్/ సోషల్ స్టడీస్ ఆప్షనల్‌గా టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ పేపర్-2 ఉత్తీర్ణత.
School Assistant-Physical Education/స్కూల్ అసిస్టెంట్ – ఫిజికల్ ఎడ్యుకేషన్ :
ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక selective సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/40 % మార్కులతో బీపీఈడీ/కనీసం 50 % మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. దీంతోపాటు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి కనీసం ఏడాది వ్యవధి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత.
SGT/ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్ట్ అర్హతల వివరాలు…
Telangana Board of Intermediate/తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం 50 % మార్కులతో ఇంటర్మీడియెట్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. అలాగే రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత. (లేదా) ఎన్సీటీఈ నిబంధనలు-2002 ప్రకారం 45 % మార్కులతో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత.
టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణత.
PHYSICAL EDUCATION TEACHER/ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) :
Telangana Board of Intermediate /తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ గుర్తింపు పొందిన Institute/ఇన్స్టిట్యూట్ నుంచి 50 % మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అలాగే ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్/అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/డిప్లొమా ఉత్తీర్ణత (లేదా) బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం ఏడాది వ్యవధి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సులో ఉత్తీర్ణత.
గమనిక: పైన పేర్కొన్న పోస్టులకు సంబంధించిన గరిష్ట అర్హత మార్కులు జనరల్ కేటగిరీకి నిర్దేశించినవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు మార్కుల శాతంలో అయిదు శాతం సడలింపు ఉంటుంది.
ఒకే పేపర్‌గా పరీక్ష!
అప్లికేషన్ ఓరియెంటేషన్ ముఖ్యం
డీఎస్సీ ఔత్సాహిక అభ్యర్థులకు విషయ పరిజ్ఞానం సాధించే విషయంలో అన్వయ దృక్పథం (అప్లికేషన్ ఓరియెంటేషన్) ఎంతో అవసరం. అప్పుడే ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. కేవలం ప్రశ్న, సమాధానం విధానంలో చదవడం వల్ల ఎక్కువ సందర్భాల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే కంటెంట్, మెథడాలజీ పరంగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన చివరి రెండు, మూడు డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను అభ్యసించడం వల్ల పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది. Notification వచ్చే వరకు ఆగకుండా.. పెడగాగీ, కంటెంట్‌కు సంబంధించి D.Ed/డీఈడీ, B.Ed/బీఈడీ స్థాయి పాఠ్య పుస్తకాల్లోని అంశాలను అధ్యయనం చేయాలి.