డిఎస్సీ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ ప్లాన్…
DSC SOCIAL SCHOOL ASSISTANT PREPARATION PLAN
( SHORTHANDHUB.COM)
School Assistant /స్కూల్ అసిస్టెంట్ syllabus ను పరిశీలిస్తే చాల వరకు అంటే సుమారు 80% సిలబస్ SGT కి నిర్ణయించినదే. SGT లోని కొన్ని చాఫ్టర్లు ను విభజించి SA లో ఎక్కువ సంఖ్యలో chapters చేస్తారు. అయినా కూడా SGT and SA రెండు పరీక్షలు రాసే అభర్ధులు లేరు కాబ్బటి SA కు prepare అయ్యే ప్రతి student ఇంతకముందు SGT సూచించిన విధంగా SOCIAL చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
సోషల్ స్కూల్ అసిస్టెంట్ పరీక్షలలో మొత్తం 80 marks కు 44 marks social content కు సంబంధించిందే. కాబట్టి స్టూడెంట్స్ జయాపజయాలు పూర్తిగా కంటెంట్ మీదనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహంలేదు.
SA సిలబస్ పై విశ్లేషణ (SGT సిలబస్ కి అదనంగా చేర్చినవి)
జాగ్రఫీ:
అగ్నిపర్వతాలు, భూకంపాలు, ప్రపంచజనాభా: సులభమయిన పాఠ్యoశాలు. వీటిలోనూ కనీసం మూడు QUESTIONS రావచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే, 9వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం భూగోళశాస్త్రాన్ని చదవాలి.
హిస్టరీ:
మధ్యయుగ ప్రపంచం, పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామిక విప్లవం, విప్లవాత్మక ఉద్యమాలు. వీటితోపాటు సామ్రాజవాదం గురించి చదవండి. ఇవి 9వ, 10వ పాఠ్య పుస్తకాలలో వుంది. వీటిలో నుంచి కనీసం రెండు QUESTIONS రావచ్చు.
సివిక్స్:
రాజ్యం—దేశం, జాతీయతలను తెలుసుకోవాలి. మొదటి సంవత్సరం పౌరశాస్త్రం బాగా చదవండి.
పౌరసత్వం, పౌరసేవాపత్రం, లోకాయుక్తా, సమాచార హక్కు, ఈ-గవర్నెన్స్ గురించి తెలుసుకోవాలి. దీనికి సంబంధించి కనీసం రెండు questions రావచ్చు. Current Affairs ను regular గా గమనిస్తే వీటిపై పట్టు సాధించవచ్చు. సులభమయిన చాప్టర్. ముఖ్యమైంది కూడా.
Economic ఎకనామిక్స్:
–వినియోగం, రాబడి, వ్యయం, ద్రవ్యోబలం, ద్రవ్యోల్బణం మొదలయిన వాటిపై దృష్టి పెట్టండి. కనీసం రెండు ప్రశ్నలు వీటినుండి రావచ్చు. 10 వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం అర్ధశాస్త్రాన్ని చదవండి.
–SGT బోధనా పద్ధతులకు 16 Marks వున్నాయి. అంటే 32 ప్రశ్నలు ఇస్తారు. ఈ అంశాలను అప్లికేషన్ ఓరియెంటెడ్ లో చదివితే బాగా గుర్తువుంటాయి.
–SGT Social కు చదవాల్సిన పుస్తకాలు:: 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, అట్లాస్.
–SA SOCIAL కు చదవాల్సిన పుస్తకాలు:: 4వ తరగతి నుండి ఇంటర్ రెండో సంవత్సరం వరకు ఉన్న ( చరిత్ర, భూగోళశాస్త్రం, అర్ధ శాస్త్రం, పౌర శాస్త్రం), ప్రభుత్వ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, అట్లాస్.
Government of Andhra Pradesh has to be released the examination pattern for DSC 2020. There will be one of the examinations named School Assistant. The School Assistant will be for a person who intends to be a teacher for class VI to X.